ఏపీలో రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు, పాక్షిక రద్దు

-

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనతో రైళ్ల రాకపోకలపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు రైళ్లను రద్దు చేసి మరికొన్నింటిని దారి మళ్లించారు. సికింద్రాబాద్ వెళ్లే ఫలక్నుమా, కోణార్క్, హౌరా-SMVB, టాటా- యార్నాకులం రైళ్లను దారి మళ్ళించగా… రేపు రాయపూర్-విశాఖ రైళ్లను ఇరువైపులా రద్దు చేశారు. పూరి-తిరుపతి, సంబల్ పూర్-నాందేడ్, విశాఖ-విజయనగరం రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. అలాగే రైలు ప్రమాదం కారణంగా చైన్నై-హౌరా మార్గంలో పలు రైళ్ళు దారి మళ్లించారు. ఈ రైళ్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Train accident in AP
Train accident in AP

మళ్లించిన రైళ్లు..

1)22852 మంగుళూరు-సంత్రాగాచీ ఎక్స్ ప్రెస్

2.) 12246 బెంగళూరు-హౌరా -దురంతో ఎక్స్ ప్రెస్

3.) 20890 తిరుపతి-హౌరా ఎక్స్ప్రెస్

4.)12704 సికింద్రాబాద్-హౌరా ఫలక్ నుమా ఎక్స్ప్రెస్

5.) 12864 బెంగుళూర్-హౌరా ఎక్స్ ప్రెస్

6.) 22305 బెంగుళూర్-జేసిద్ద్ ఎక్స్ ప్రెస్

7). 22503 కన్యాకుమారి-బెంగుళూరు ఎక్స్ ప్రెస్

8.)చెన్నై-హౌరా ఎక్స్ ప్రెస్

9) 18048 వస్గోడి గామా-శాలిమర్ ఎక్స్ ప్రెస్

Read more RELATED
Recommended to you

Latest news