World Cup 2023 : ప్రపంచ కప్‌ లో ఇంగ్లండ్ చెత్త రికార్డులు

-

 

World Cup 2023 : భారత్ చేతిలో ఓటమితో ఇంగ్లాండు చెత్త రికార్డులు నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్గా WCలో వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిన రెండో జట్టుగా నిలిచింది. 1992లో ఆస్ట్రేలియా ఇలా ఓడిపోయింది. అలాగే ENG వరుసగా మూడు మ్యాచ్లలో 200 రన్స్ లోపే ఆల్ అవుట్ కావడం WC హిస్టరీలో ఇదే తొలిసారి.

England's worst record in the World Cup
England’s worst record in the World Cup

SA చేతిలో 170, SLతో మ్యాచ్ లో 156, నిన్న భారత్ చేతిలో 129 రన్స్ కు ENG ఆల్ అవుట్ అయ్యింది. అలాగే ఆరుగురు బౌల్డ్ కావడం 1975 తర్వాత ఇదే తొలిసారి. కాగా, నిన్న జరిగిన మ్యాచ్‌ లో టీమిండియా జయ కేతనం ఎగురవేసింది. ఇంగ్లాండ్ తో ఆదివారం జరిగిన లోస్కోరింగ్ గేమ్ లో టీమిండియా 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా సెమిస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news