లోక్ సభ వ్యవహారాలను సంస్కృతంలోకి అనువదించడాన్ని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సభలో వ్యతిరేకించారు. అది ప్రజాధనాన్ని వృధా చేయడమేనని పేర్కొన్నారు. 2011 లెక్కల ప్రకారం.. దేశంలో సంస్కృతం మాట్లాడేవారు 73వేల మంది మాత్రమే ఉన్నారు. సభ వివరాలను సంస్కృతంలోకి తర్జుమా చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని స్పష్టం చేశారు. ఆయన వాదనను స్పీకర్ ఓం బిర్లా తోసి పుచ్చారు.
ప్రధానంగా పార్లమెంట్ లో సంస్కృతం పై ట్యాక్స్ పేయర్ల డబ్బు ఎందుకు వేస్ట్ చేస్తున్నారని ప్రశ్నించిన డీఎంకే ఎంపీ దయానిధి మారన్ కు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా పంచ్ ఇచ్చారు. గౌరవనీయ సభ్యులారా.. మీరే దేశంలో ఉన్నారో తెలుసా..? ఇది భారత్.. ఈ దేశ మూల భాష సంస్కృతమే. పార్లమెంట్ 22 భాషలను అధికారికంగా గుర్తించింది. అందులో సంస్కృతం, హిందీ సైతం ఉన్నాయి. వాటితో మీకేంటి సమస్య అన్ని భాషల్లోనూ అనువాదం కొనసాగుతుందని బదు