పల్నాడులో దారుణం.. భర్త, అత్తామామలను నరికి చంపిన కోడలు

-

ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. కోనంకి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున గమనించిన స్థానికులు సమాచారం అందించడంలతో పోలీసులకు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే నిందితులు ఎవరో ఆరా తీసేలోపే.. ఈ దారుణానికి ఒడిగట్టిన వారు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనంకి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని మృతులను సాంబశివరావు (50), భార్య ఆదిలక్ష్మి (47), కుమారుడు నరేష్‌ (30)ను సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యలకు సంబంధించి ముప్పాళ్ల పీఎస్‌లో సాంబశిరావు కోడలు మాధురి, నిందితులు లొంగిపోయినట్లు తెలిపారు. అయితే కోడలే తన భర్త, అత్తామామలను తన బంధువుల సాయంతో అత్యంత కిరాతకంగా నరికి చంపినట్లు స్థానికులు భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news