శ్రీవారి భక్తులకు అలర్ట్​ .. ఆ ఒక్క రోజు పలు సేవలు రద్దు

-

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. వేంకటేశ్వర స్వామి ఆలయంలో మలయప్పస్వామికి ఏటా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా మూడు రోజులపాటు జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తారు. దీనిని అభిద్యేయక అభిషేకం అని కూడా అంటారు. జూన్​ 19వ తేదీ నుంచి జూన్​ 21వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ అభిషేకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జూన్​ 21వ తేదీన పలు సేవలు రద్దు చేస్తూ టీటీడీ తెలిపింది.

ఈ క్రమంలోనే జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21వ తేదీ క‌ల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. మరోవైపు జ్యేష్ఠాభిషేకం రోజు రాత్రి పౌర్ణమి ఘడియల్లో శ్రీవారికి నిర్వహించే పున్నమి గరుడ సేవ కమనీయంగా జరుగుతుంది. ఈ గరుడ సేవ చూసిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. ఆరోజు తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని టీటీడీ అధికారులు తెలిపారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news