స్వామిజీలు ఇచ్చే సూచనలు శిలాశాసనంలా భావించి అమలు చేస్తామని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. సనాతన హైందవ ధర్మ పరిరక్షణకు వెదురుపాకం స్వామిజీ చేస్తున్న కృషి గొప్పదన్నారు. టీటీడీకి సలహాలు ఇవ్వడానికి మహవిష్ణువే స్వామిజీలను ధార్మిక సదస్సుకు పంపినట్లుగా ఉందని వెల్లడించారు చైర్మన్ కరుణాకర్ రెడ్డి.
స్వామిజీలు చూపే దారిలో టిటిడి నడుస్తూ హైందవ ధర్మాని పరిరక్షిస్తుందని తెలిపారు. స్వామిజీలు ఇచ్చే సూచనలు, సలహాలు తూచా తప్పకూండా పాటిస్తామని పాలకమండలి తరపున మాట ఇస్తూన్నామన్నారు. స్వామిజీలు ఇచ్చే సూచనలు శిలాశాసనంలా భావించి అమలు చేస్తామని పరకటించారు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి.
కాగా, నిన్న తిరుమల శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలాగే… నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 69,332 మంది భక్తులు దర్శించుకున్నారు. అంతేకాకుండా నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.22 కోట్లుగా నమోదు అయింది.