శ్రీవాణి ట్రస్ట్ పై పవన్, చంద్రబాబుకు టిటిడి ఇఓ దర్మారెడ్డి సవాల్ ?

-

శ్రీవాణి ట్రస్ట్ పై పవన్, చంద్రబాబుకు టిటిడి ఇఓ దర్మారెడ్డి సవాల్ విసిరారు. తిరుమల శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై రాజకీయ ఆరోపణలు చేస్తూన్నా వారికి సవాల్ విసిరారు టిటిడి ఇఓ దర్మారెడ్డి. శ్రీవాణి ట్రస్ట్ ని గత ప్రభుత్వ హయంలో 2018 ఆగస్ట్‌ లోనే ప్రారంభించారని వివరించారు.

ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ కి 860 కోట్లు విరాళాలు అందాయని…. ఈ ట్రస్ట్ కి అందించిన విరాళాలుతో పారదర్శకంగా 2445 ఆలయాల నిర్మాణం ప్రారంభించామని ప్రకటించారు టిటిడి ఇఓ దర్మారెడ్డి. ఎస్సి, ఎస్టి, బిసి కాలనీలో ఆలయాల దూఫధీప నైవేద్యాలకు ప్రతి నెల 5 వేలు చెల్లిస్తూన్నామని చెప్పారు. ఆరోపణలు చేసే వారు తమ ఆడిటర్లతో వచ్చి శ్రీవాణి ట్రస్ట్ నిధులు నిర్వహణ తీరుని పరిశిలించుకోవచ్చని… గత 50 సంవత్సరాల టిటిడి పరిపాలనలో ఎలాంటి అనినీతి జరగలేదు…అందుకు ఆస్కారం కూడా వుండదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news