తిరుమల భక్తులకు అలర్ట్. ఈ నెల 18 నుంచి ఆన్ లైన్లో అక్టోబర్ నెల దర్శన టిక్కెట్ల విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు టీటీడీ ఈవో శ్యామలరావు. భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేయనుందని తెలిపారు.
రోజు రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అన్నప్రసాద సముదాయంలో యంత్రాల ఆధునీకీకరణ, ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని ప్రకటించారు.
అటు తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఉంది. 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73, 353 మంది భక్తులు కాగా.. 28, 444 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 3.05 కోట్లుగా నమోదు అయింది.