తిరుమల శ్రీవారికి భారీగానే ఆదాయం వస్తోంది. జనవరి నెలలో తిరుమల శ్రీవారిని 21.09 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తాజాగా టీటీడీ నివేదిక విడుదల చేసింది. అలాగే…జనవరి నెలలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.116.46 కోట్లుగా నమోదు అయినట్లు స్పష్టం చేసింది టీటీడీ పాలక మండలి. అలాగే… జనవరి నెలలో లడ్డూలు 1.03 కోట్లు విక్రయించారు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 46.46 లక్షలుగా నమోదు అయింది.
జనవరి నెలలో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 7.05 లక్షలుగా నమోదు అయినట్లు తెలిపింది టీటీడీ. ఇది ఇలా ఉండగా, తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న ఒక్క రోజే 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 57,223 మంది భక్తులు..దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 18,015 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.44 కోట్లుగా నమోదు అయింది.