తిరుమల శ్రీవారి భక్తులకు TTD కీలక సూచన

-

తిరుమల శ్రీవారి భక్తులకు TTD కీలక సూచనలు చేసింది. తిరుమలలో ఈనెల 23 నుంచి జనవరి ఒకటి వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధులు అందించే సిఫారసు లేఖలను ఆ పది రోజులపాటు స్వీకరించబోమని స్పష్టం చేశారు.

TTD is a key reference for devotees of Tirumala Srivari

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో తొందరపాటు లేకుండా ఆ పది రోజుల్లో ఏదో ఒక రోజు దర్శనం చేసుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ విఐపిలకు కూడా పరిమితంగానే బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు.

కాగా, శ్రీవారి భక్తుల కోసం 2024 మార్చి నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలను టీటీడీ ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్‌ కోసం ఈ నెల 18వ తేదీన ఉదయం 10గంటల నుంచి 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news