శ్రీవారి మార్చి నెల సేవా టికెట్లు 21 నుంచి అందుబాటులోకి

-

శ్రీవారి భక్తుల కోసం 2024 మార్చి నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలను టీటీడీ ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్‌ కోసం ఈ నెల 18వ తేదీన ఉదయం 10గంటల నుంచి 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.

8 hours for Sarvadarshan of Tirumala Srivari

21వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో శ్రీవారి తెప్పోత్సవాల టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార వర్చువల్‌ సేవలకు సంబంధించిన టికెట్లు, దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తామని చెప్పారు.

23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటా, 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులు వెబ్‌సైట్‌ https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news