నందిని నెయ్యిని నిరాకరించిన టీటీడీ.. కారణమేంటంటే..?

-

తిరుమల లడ్డూ అంటే ఇష్టం ఉండని వారుండరు. ఎవరైనా తిరుమలకు వెళ్తే కచ్చితంగా లడ్డూ తీసుకురమ్మని చెబుతుంటారు. మరి ఆ లడ్డూ తయారీలో ఇప్పటి వరకు కర్ణాటకలో తయారు చేసే నందిని బ్రాండ్‌ నెయ్యిని వినియోగించే వారు. కానీ ఇక నుంచి ఆ నెయ్యిని వినియోగించబోమని టీటీడీ బోర్డు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్‌) అధ్యక్షుడు భీమానాయక్‌ వెల్లడించారు.

నందిని పాల ఉత్పత్తుల ధరలు పెరగడంతో మరో కంపెనీ నుంచి నెయ్యిని కొనుగోలు చేసుకుంటామని టీటీడీ బోర్డు వెల్లడించినట్లు భీమానాయక్‌ తెలిపారు. మరోవైపు.. నందిని నెయ్యిని కొనుగోలు చేసేందుకు టీటీడీ అనుమతించడం లేదని కేఎంఎఫ్‌ అధ్యక్షుడు బీమానాయక్‌ చేసిన ఆరోపణలు అవాస్తవమని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మార్చిలో నెయ్యి కొనుగోలుకు టీటీడీ ఈ-టెండర్లను ఆహ్వానించిందని.. ఇందులో కేఎంఎఫ్‌ పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఫెడరేషన్‌ నుంచి టీటీడీ 20 సంవత్సరాలుగా నెయ్యిని  కొనుగోలు చేస్తోందని.. ఇప్పటివరకు ఈ-టెండర్ల ద్వారానే కొనుగోలు చేస్తున్నామని.. టెండర్లలో ఎల్‌1గా వచ్చిన వారి వద్ద నుంచి కొనుగోలు చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news