వారణాసిలో ఏపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య !

-

వారణాసిలో ఏపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. ఏలూరులోని ఉంగుటూరు మండలం నారాయణపురం చెందిన అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఏప్రిల్ నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయిన అన్నదమ్ములు లక్ష్మీనారాయణ (34), వినోద్ (32) వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. బంధువుల ఫిర్యాదుతో మే నెలలో చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. రియల్ ఎస్టేట్,  ఫైనాన్స్ వ్యాపారం చేసే వారు ఈ ఇద్దరు అన్నదమ్ములు.

Two brothers from AP committed suide in Varanasi

వారణాసిలో ఆంధ్ర ఆశ్రమంలో అద్దెకు తీసుకున్న గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల సెల్ ఫోన్ లో మొబైల్ నెంబర్ల ఆధారంగా నారాయణపురంలో బంధువులకు సమాచారం ఇచ్చారు వారణాసి పోలీసులు. ఇంటి నుంచి వెళ్లిపోయిన సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో కొందరు బెదిరిస్తున్నారని దాంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలు పంపారు అన్నదమ్ములు. ఇక మృతదేహాల కోసం వారణాసి వెళ్లారు బంధువులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version