తెలంగాణలో మరో రెండు గ్యారెంటీలు అమలు

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రెండు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేసింది. మరో రెండు గ్యారెంటీలను అమలు చేయాలని నిర్ణయించింది.

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అక్షతన సమీక్ష నిర్వహించారు. ఇందులో విధి విధానాలపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. వారం రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించాలని నిర్ణయించి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. గృహలక్ష్మీ,  రూ.500కే గ్యాస్ సిలిండర్ ను ప్రారంభించాలని భావిస్తోంది. ఫిబ్రవరి 27 లేదా 29 తేదీల్లో ప్రారంభించానున్నారు. అదేవిధంగా ఉచిత విద్యుత్  వంటి పథకాన్ని కూడా వారం రోజుల్లో ప్రారంభిస్తామని ఇటీవలే మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. 100 రోజుల్లోపే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల లోపు అమలు చేసి లోక్ సభ ఎన్నికల్లోకి వెళ్లాలని భావిస్తోంది కాంగ్రెస్.

Read more RELATED
Recommended to you

Latest news