ఏపీ రాజకీయాల్లోకి కలకలం. వైసీపీలోకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెళతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నెల 26న మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షం లో ఉండవల్లి వైసీపీలో చేరతారంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే… ఉండవల్లి వైసిపిలో చేరబోతున్నారనే వార్తలు నిజం కాదని అంటున్నారు సన్నిహితులు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/04/undavalli-arun-kumar-on-cm-jagan.webp)
తాను మళ్ళీ రాజకీయాల్లోకి రానని ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. 2013లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. గత పదేళ్లుగా పలు కీలకమైన అంశాలపై రాజమండ్రి నుంచి మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే.. ఇటీవలే శైలజానాథ్ వైసీపీ పార్టీలోకి వెళ్లడంతో… వైసీపీలోకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వెళతారంటూ ప్రచారం జరుగుతోంది.