2014లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకోవాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. బీజేపీ తో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ తీసుకోవాలని నాలుగు పేజీల లేఖ లో కోరారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని కొలిక్కి తీసుకురావాలని కోరారు.
రాష్ట్ర విభజన విషయం పై నేను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పదేల్లుగా నడుస్తూనే ఉందని.. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదన్నారు. కౌంటర్ తో పాటు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరు తరువాత మనకు జరిగిన అన్యాయం విషయం పై చర్చకు నోటీసులు ఇప్పించాలని గతంలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని.. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారని కారణాలేమైనా అది జరుగలేదని లేఖలో పవన్ దృష్టికి తీసుకెళ్లారు అరుణ్ కుమార్.