ఏపీలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్

-

ఏపీలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ, గుంటూరు జిల్లాలో భారీగా ఆస్తి,పంట నష్టం సంభవించిన విషయం తెలిసిందే. కృష్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో బుడమేరు వాగు కాలువకు గండ్లు పడ్డాయి. దీంతో వరద ఉధృతి పెరిగి లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యాయి. ఇప్పటికే ముంపు ప్రాంతాలను సీఎం చంద్రబాబు, అధికారులు పరిశీలించి జరిగిన నష్టంపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరడంతో కేంద్ర బృందాలు ఏపీలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి విచ్చేశారు.

తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ సైతం ఏపీలో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తుండగా.. ఏపీ అధికారులు జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రికి వివరిస్తున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్రమంత్రి.. నష్టం తీవ్రతను రైతులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన అందరికీ న్యాయం చేస్తామని కేంద్రమంత్రి రైతులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్రమంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరీశ్వరి తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version