ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. నేటి నుంచి టీబీ నియంత్రణకు టీకాలు వేయనున్నారు అధికారులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపిక చేసిన 12 జిల్లాల్లో నేటి నుంచి క్షయ నియంత్రణ టీకా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే హైరిస్క్ ఉన్న బాధితుల గుర్తింపు ప్రక్రియను వైద్యశాఖ పూర్తి చేసింది.
టీబీ చరిత్ర కలిగిన వారితో పాటు రోగుల కుటుంబ సభ్యులు, ధూమపానం చేసేవారు, మధుమేహం వ్యాధిగ్రస్తులు, తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగిన వ్యక్తులకు తోలుత టీకాలు వేస్తారు. 12 జిల్లాల్లో ఈ వర్గాల వారు 50 లక్షల మంది ఉన్నట్లు అంచనా వేశారు.
ఇక అటు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం అయ్యాయి. నిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1480, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్కు రూ.502 కోట్లు విడుదల చేసింది జగన్ సర్కార్. మిగిలిన పథకలకూ విడుదల కానున్నాయి నిధులు. రెండు, మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తిచేయనుంది జగన్ ప్రభుత్వం.