డబ్బులు చూపి.. కొనుగోలు చేయడంలో చంద్రబాబు ఎక్స్ పర్ట్ – వల్లభనేని వంశీ

-

డబ్బులు చూపి.. కొనుగోలు చేయడంలో చంద్రబాబు ఎక్స్ పర్ట్ అని తెలుగు దేశం పార్టీ రెబల్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వల్లభనేని వంశీ స్పందించారు. మా మాజీ బాస్ డబ్బులు చూపి కొనుగోలు చేయడంలో ఎక్స్ పర్ట్ అని… డబ్బులు ఎర చూపి నలుగురిని కొనుగోలు చేసినట్లు తెలిసింది..అందువలనే టిడిపి గెలిచిందని నిప్పులు చెరిగారు.

ఆ నలుగురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు రాదానే చంద్రబాబుతో బేరం కుదుర్చుకున్నారని ఆగ్రహించారు. దీంతో ఇద్దరికి మేలు జరిగింది.. చంద్రబాబు కు ఓటు వచ్చింది, వీరికి క్యాష్ వచ్చిందన్నారు. మొన్న తెలంగాణలో అధికారంలోకి వస్తాం అని టిడిపి అంది ఇప్పుడు ఎపిలో 175 గెలుస్తామని చెబుతుంది, జరిగేవి చెప్పాలన్నారు తెలుగు దేశం పార్టీ రెబల్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

Read more RELATED
Recommended to you

Latest news