హైదరాబాదులో నిన్న అరెస్ట్ అయిన వల్లభనేని వంశీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వల్లభనేని వంశీకి దాదాపు 14 రోజులపాటు రిమాండ్ విధించింది కోర్టు. సూర్యా రావు పేట పోలీస్ స్టేషన్ నుంచి వల్లభనేని వంశీని విజయవాడ జిల్లా జైలుకు తాజాగా తరలించారు ఏపీ పోలీసులు. వల్లభనేని వంశీ తో పాటు లక్ష్మీపతి కృష్ణ ప్రసాద్ ను కూడా విజయవాడ జైలుకు తరలించడం జరిగింది.

ఇక నిన్న రాత్రి సూర్య రావు పేట పోలీస్ స్టేషన్ లోనే వంశీ ఉండడం జరిగింది. ఈ తరుణంలోనే కోర్టు కీలక తీర్పు కూడా ఇచ్చింది. 14 రోజులపాటు రిమాండ్ లోకి తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాగా ఓ కిడ్నాప్ కేసు అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన నేపథ్యంలో… కూటమి ప్రభుత్వం కేసు పెట్టి లోపల వేసింది. దీంతో నిన్నటి నుంచి పోలీసు పోలీస్ స్టేషన్ లోనే ఉంటున్నారు వల్లభనేని వంశీ.