పిఠాపురం రేప్ కేసు విషయంలో.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయారు వైసీపీ నేత వంగా గీత. కాకినాడ జిజిహెచ్ సఖి సెంటర్ లో ఉన్న పిఠాపురం అత్యాచార మైనర్ బాలికను పరామర్శించారు మాజీ ఎంపీ వంగా గీత. అనంతరం వంగా గీత మాట్లాడుతూ… కాకినాడ జిల్లా క్రైమ్ పై డిప్యూటీ సీఎం పవన్ రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు.

అర్ధరాత్రి 12 గంటలకు మహిళలు రోడ్లపై తిరిగితే స్వాతంత్రం వస్తుందని గాంధీ చెప్పారన్నారు. పిఠాపురంలో మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు పై ఉన్న మహిళపై అత్యాచారం చేశారని ఆగ్రహించారు మాజీ ఎంపీ వంగా గీత. అత్యాచారం నిందితుడు కూటమి పార్టీలలో ఉన్న వ్యక్తి అని తెలిపారు. నిందితుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వెలుగులోకి రాని సంఘటనలు చాలా జరుగుతున్నాయన్నారు మాజీ ఎంపీ వంగా గీత.