మచ్చుమర్రిలో బాలిక హత్య కేసుపై హోం మంత్రి వంగలపూడి అనిత కీలక ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు, గంజాయి అంశాల పై సీఎం సమీక్ష చేశారు… నంద్యాల జిల్లా మచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం, దారుణం అన్నారు. మైకంలో తాత వరుస వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేశాడు, మచ్చుమర్రిలో బాలికను హత్య చేసి రాయి కట్టి మరీ రిజర్వాయర్లోకి తోసేశారని ఆగ్రహించారు.
ఈ ఘటనల్లో బాలికల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు….మద్యం, గంజాయి డ్రగ్స్ మత్తు లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ రెండు అంశాల పై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపాలని సీఎం ఆదేశించారు…. మచ్చుమర్రి ఘటనలో మైనర్లు ఉన్నారన్నారు. ఫోన్లలో అశ్లీల వెబ్ సైట్లు అందుబాటులోకి వస్తుండటమూ ఈ తరహా ఘటనలకు కారణం అవుతోందని తెలపారు. క్రిమినల్ కు పార్టీ, క్యాస్ట్ ఉండదు…వారికి శిక్ష పడాల్సిందే అని తేల్చి చెప్పారు హోం మంత్రి వంగలపూడి అనిత.