వారాహిని నారాహిగా మార్చారు – మంత్రి చెల్లుబోయిన

-

వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఆరోపణలపై అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే ద్వారంపూడి. పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే కాకినాడలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి దమ్ముంటే ఎమ్మెల్యే ద్వారంపూడి చాలెంజ్ ని స్వీకరించాలని సవాల్ విసిరారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.

నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పదేపదే కులం గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం..? అని నిలదీశారు. వారాహిని నారాహిగా మార్చారని ఎద్దేవా చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా మాట్లాడుతూ 2019వ సంవత్సరంలో మీరు చేసిన ప్రయత్నం ప్రజాభిమానం పొందలేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version