వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఐప్యాక్ టీమ్ కంటెంట్ ఇస్తే.. పేస్ బుక్ లో పోస్ట్ చేసే వాళ్లమని వెల్లడించారు. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని టార్గెట్ చేసుకొని నాయకులు, వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టామని తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనలతోనే పోస్టులు చేశాం. సజ్జల భార్గవ రెడ్డి బాధ్యత తీసుకున్నాక మరింత రెచ్చిపోయామన్నారు.
జడ్జీలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడు. 2023 నుంచి నా ఫేస్ బుక్ లో ఐడీతో భార్గవరెడ్డి పోస్టులు పెట్టేవారు. షర్మిల, సునిత, విజయమ్మ పై అసభ్యకర పోస్టులు పెట్టామని తెలిపారు. ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ పీఏ రాఘవ రెడ్డి మాకు కంటెంట్ ఇచ్చారు. ఎలాంటి పోస్టులు పెట్టాలనేది కూడా అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి చర్చించే వారు. పవన్, ఆయన పిల్లలపై కూడా అసబ్యకరమైన పోస్టులు పెట్టినట్టు తెలిపారు. వైసీపీ సోషల్ మీడియాలో భార్గవ రెడ్డి, సుమా రెడ్డి కీలకమని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయ మూర్తి ఎదుట హాజరు పరచగా.. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు జడ్జీ.