ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అర్థం అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్ తో పాటు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం పై ఆమె మండిపడ్డారు. ప్రజల ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోతే వారికి వెన్ను పోటు పొడవడం కాదా..? అని ప్రశ్నించారు. మేము ఓడిపోతే అసెంబ్లీకి పోమని ముందే ప్రజలకు చెప్పారా..? అని ఆమె నిలదీశారు.
అసెంబ్లీకి వెళ్లకపోతే వాట్ ఆర్ యూ..? ఆలోచన అయినా ఉండనవసరం లేదా..? ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించారు. అలాంటి అప్పుడు అసెంబ్లీకి వెళ్లను అంటే.. మీరు ప్రజలకు వెన్ను పోటు పొడచడం కాదా..? అన్నారు. మిమ్మల్ని గెలిపిస్తే.. వాళ్లను అసెంబ్లీలో మీరు రిప్రజెంట్ చేస్తారని ప్రజలు అనుకున్నారు. కానీ అలాంటి అప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్లకపోతే మీరు ప్రజలను మోసం చేసినట్టు కాదా..? అని ప్రశ్నించారు షర్మిల.