Vasireddy Padma : ఏపీ సర్కార్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మహిళా ఛైర్ పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇచ్చారు వాసిరెడ్డి పద్మ.

వైసీపీ పార్టీ కోసం పని చేయాలని భావిస్తున్నట్టు సీఎం జగన్ కు చెప్పారు వాసిరెడ్డి పద్మ. ఇక పార్టీ ఆదేశాల మేరకు పని చేయడానికి సిద్దమన్న వాసిరెడ్డి పద్మ.. తాజాగా ఏపీ మహిళా ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు.