తిరుమలలో నిలువు దోపిడీ.. తలనీలాలు తీయాలంటే రూ.100 ఇవ్వాల్సిందే..!

-

తిరుమల శ్రీవారి సన్నిధిలో నిలువు దోపిడీ చేస్తున్నారు. తలనీలాలు తీయాలంటే ₹100 ఇవ్వాల్సిందే అంటూ.. అక్కడ కేశఖండన చేసే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తలనీలాలు తీసేందుకు ఓ మహిళా ఉద్యోగి… వంద రూపాయలు అడుగుతుండగా ఓ వ్యక్తి వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… భక్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Vertical robbery in Tirumala

తమ దగ్గర కూడా 100 రూపాయలు వసూలు చేశారని.. అప్పుడు మేం ప్రశ్నించలేకపోయామని వాపోతున్నారు భక్తులు. తలనీలాలు ఇచ్చేందుకు… టికెట్ డబ్బులు వేరే అలాగే… తలనీలాలు చేసినందుకు ఉద్యోగులు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. తిరుమల ఒక్కటే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని… ప్రముఖ దేవాలయాలలో ఇదే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news