సీఐ సుబ్బారాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారని మాజీ మంత్రి విడదల రజినీ ఆగ్రహించారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రజనీ ప్రయాణిస్తున్న కారును నిలిపి, అందులోనే ఉన్న శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రజనితో పోలీసులు వాగ్వాదానికి దిగారు.

అయితే ఈ సంఘటన పై మాజీ మంత్రి విడదల రజినీ స్పందించారు. మహిళ అని కూడా చూడకుండా సీఐ మీద మీదకి వచ్చారన్నారు విడదల రజిని. సీఐ సుబ్బారాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు.. నాపై కేసులు పెడతానని బెదిరించారు.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు రజిని.
–