వ్యూస్, లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన యువకుడు

-

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతోంది యువత. వ్యూస్, లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టాడు యువకుడు. రైలు వెళ్తుండగా పట్టాలపై పడుకున్నాడు ఓ యువకుడు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం అంటూ ఎక్స్ లో వీడియో షేర్ చేశారు సజ్జనార్.

The young man who risked his life for views and likes
The young man who risked his life for views and likes

ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి అంటూ యువతను హెచ్చరించారు సజ్జనార్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. వీక్షకుల కోసం రకరకాల స్టoట్స్ చేస్తున్నారు జనాలు. ఈ నేపథ్యంలోనే యువకుడు ట్రైన్ కింద పడుకొని రచ్చ చేశాడు. అయితే ఈ వీడియో వైరల్ కావడం తో సజ్జనార్ షేర్ చేశారు. అయితే ఈ వీడియో పై పోలీసులు ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news