రెండో భార్యతో వివేకానంద రెడ్డి వీడియోలు వైరల్ !

-

Vivekananda Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గెలుపు లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆయనకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసును తెరపైకి తీసుకు వస్తున్నాయి టిడిపి అలాగే జనసేన పార్టీలు.

Vivekananda Reddy’s videos with second wife’s son are viral

బాబాయ్ హత్య వెనుక జగన్ కుట్రలు చేశారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన రెండవ భార్య అలాగే కొడుకు తో వివేకానంద రెడ్డి జాలిగా గడిపిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్నికలవేళ… ఈ వీడియోను కొంతమంది వైరల్ చేశారు.

ఇందులో తన రెండో భార్యతో కూర్చొని… కొడుకుతో ఆడుకుంటున్నాడు వివేకానంద రెడ్డి. తెల్ల పాయింట్ మరియు షర్ట్ వేసుకొని కనిపించాడు వివేకానంద రెడ్డి. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసు కు రెండవ పెళ్లి కారణమని వైసిపి మొదటి నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడం మనం చూస్తూ ఉన్నాం. దీనిపై వైసీపీ అలాగే తెలుగుదేశం పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news