Harish Rao: నన్ను ఏక్ నాథ్ షిండే అంటే చెప్పుతో కొడుతానంటూ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తన మీద ఎక్ నాథ్ షిండే అంటూ ఆరోపణ చేస్తున్న వారికి చెప్పుతో కొడతా అంటూ సమాధానం ఇచ్చారు హరీష్ రావు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన మాకు లేదన్నారు హరీష్‌రావు. కాంగ్రెస్ నిండు ఐదేళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. అన్ని హామీలు అమలు చేసి రేవంత్ మాకంటే ఎక్కువ మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు హరీష్‌రావు. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్‌ను ప్రజలే బండకేసి కొడతారని హెచ్చరించారు హరీష్‌రావు.