మందు తాగు కానీ వెంటనే మజ్జిగ జోలికి వెళ్లకు రోయ్.. గోరంట్ల బుచ్చయ్యకు విజయసాయి కౌంటర్ ట్వీట్

-

తెలుగుదేశం పార్టీ నేతలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కి మధ్య సోషల్ మీడియాలో ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఓ మహిళను ఈడ్చి కొట్టావు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని టార్గెట్ చేసి ఓ ఫోటోను పోస్ట్ చేసారు విజయసాయిరెడ్డి. అయితే అది మార్ఫింగ్ ఫోటో అని తేల్చి చెప్పేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. నువ్వు జైల్లో ఉన్నప్పుడు జరిగినవి నిజాలు అనుకుంటే ఎలా పిచ్చిరెడ్డి అంటూ ప్రశ్నించారు.

ఊరంతా వడ్లు ఎండపెట్టుకుంటే నక్క తోక ఎండపెట్టుకుంది అంట అలా ఉంది మిస్టర్ బ్రోకర్ వీసా రెడ్డి నీ యవ్వారం అంటూ పేర్కొన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వైజాగ్ ఎల్జి పాలిమర్స్ లో గ్యాస్ లీక్ లో నువ్వు చేసింది ఏంటి బ్రోకర్ సాయి అంటూ ప్రశ్నించారు. 20 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. దాదాపు 500 మంది అభాగ్యులు అయ్యారు. ఇప్పటివరకు వారికి పరిహారం అందలేదని బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ కి విజయసాయి రీట్వీట్ చేశారు.

” వయసు పైబడినా పెద్ద గ్రంథ సాంగుడివేనని ఇప్పుడే తెలిసిందిరా తలంట్ల బుచ్చిగా! తెలుగు మహిళ అధ్యక్షురాలు పోస్టుకు ఆమె పేరు సిఫార్సు చేస్తే నీ సొంత పార్టీ వాళ్లే అడుక్కున్నారట కదా? మందు తాగు, కానీ వెంటనే మజ్జిగ జోలికి వెళ్లకు రోయ్. అసలే ఏజ్ బార్ అయింది” అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version