చంద్రబాబు పై విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు.ఆల్ ఫ్రీ మాయాఫెస్టో అంటూ యూటర్న్ అయ్యారని విజయసాయి రెడ్డి చురకలు అంటించారు. Saturation modeలో సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని జగన్ గారు శ్రీలంకలా నాశనం చేస్తున్నారని గగ్గోలు పెట్టిన విపక్ష ‘పెద్ద మనుషులు’ మరోసారి యూటర్న్ తీసుకుని ఆల్ ఫ్రీ ‘మాయాఫెస్టో’ను విడుదల చేశారని మండిపడ్డారు. ఇది వారి మానసిక స్థితికి అద్దం పడుతోంది.
దీనినే సైకాలజీలో ‘హిపొక్రాటికల్ కాగ్నిటివ్ డిస్సోనాన్స్’ (Cognitive Dissonance) అని వ్యవహరిస్తారన్నారు. కౌలు రైతులకు పెద్దఎత్తున కౌలు కార్డులు (పంట సాగు పత్రాలు) జారీ చేస్తూ రైతులకు కలిగే అన్నీ ప్రయోజనాలను కౌలు రైతులకూ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అన్నారు. కౌలు రైతులకు నూరుశాతం పంట రుణాలు, వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ. ఇది కదా సంక్షేమ సేద్యం అంటే అంటూ చురకలు అంటించారు. పతనమైన వ్యక్తిత్వాన్ని సూచించే inconsistency, pretense, blame, and complacency అనే పదాలు రోజూ మైకుల ముందు రంకెలేసే టీడీపీ నాయకులకు వర్తిస్తాయి. పచ్చ పార్టీలో అలాంటి వారేవరో చెప్పుకోండి చూద్దo అన్నారు విజయసాయి రెడ్డి.