విజయసాయిరెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు విజయసాయిరెడ్డి. నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుచూ విజయసాయిరెడ్డి పిటిషన్ వేశారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరారు విజయసాయిరెడ్డి. సీబీఐ స్పందన కోసం విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.
ఇది ఇలా ఉండగా.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి శనివారం అంటే 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను అని తెలిపారు. అలాగే నేను ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి రుణపడి ఉన్నానని తెలిపారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.