ఇంద్రకీలాద్రి అమ్మవారి మొదటి రోజు హుండీ లెక్కింపు..!

-

ఇంద్రకీలాద్రి అమ్మవారి మొదటి రోజు హుండీ లెక్కింపు పూర్తయింది. 15 రోజులకు నగదు రూ. 3,50,28,700 రూపాలు వచ్చాయి. కానుకల రూపములో బంగారం: 272 గ్రాములు, వెండి: 9 కేజీల 325 గ్రాములు భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు. ఇక విదేశీ కరెన్సీ చూస్తే.. USA – 285 డాలర్లు, UAE – 20 దిర్హమ్స్, ఒమాన్ – 0.5 రియల్స్ 100 బైసా, మలేషియా – 2 రింగేట్లు, ఇంగ్లాండ్ – 20 పౌండ్లు, కేనెడా – 50 డాలర్లు, కువైట్ – 5 దినార్లు, సౌదీ – 15 రియాల్స్, ఇంగ్లాండ్ – 15 పౌండ్లు, ఆస్ట్రెలియా – 160 డాలర్లు, సింగపూర్ – 6 డాలర్లు వచ్చాయి.

ఇక రేపు కూడా హుండీ లెక్కింపు కొనసాగనుంది. అయితే ఈరోజు హుండీ లెక్కింపు నందు ఆలయ ఈవో కె ఎస్ రామరావు , డీప్యూటీ ఈవో రత్న రాజు , దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు మరియు ఆలయ సిబ్బంది, SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news