దివ్య మర్డర్ కేసు.. నాగేంద్ర విషయంలో పోలీసుల సీక్రసీ ?

-

విజయవాడలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని కేసు అనేక మలుపులు తిరుగుతోంది. దివ్యని హత్య చేసిన నాగేంద్ర ని అరెస్టు చేసే అంశం మీద ఇంకా సస్పెన్స్ వీడలేదు. నాగేంద్ర ఇంకా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అయితే ఇప్పటికే దివ్య హత్య కేసుని దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ ని కూడా సిద్దం చేశారు పోలీసులు.

ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్టు, పోస్టుమార్టం నివేదికలు రావడంతో ఛార్జ్ షీట్ పక్కాగా రెడీ చేశారు. అయితే చట్ట ప్రకారం నాగేంద్రను అరెస్ట్ చేశాకనే ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అందుకే నాగేంద్ర అరెస్ట్, డిశ్చార్జ్ విషయంలో పోలీసులు గోప్యత పాటిస్తున్నట్టు చెబుతున్నారు. రేపు లేదా ఎల్లుండి నాగేంద్రని అరెస్ట్ చేసినట్టు చూపే అవకాశం కనిపిస్తోంది. అటు నుండి ఆటే నాగేంద్రని రిమాండ్ కి తరలించే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version