రాష్ట్రపతి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. జాలరిపేటలో మత్స్యకార దేవతలు ఆలయ నిర్మాణం పనులు పరిశీలించిన సాయిరెడ్డి…రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరూ వద్దంటారు..దశాబ్దాలుగా ఆ వర్గాలు సామాజికంగానూ, రాజకీయంగానూ పైకి వస్తామంటే అన్ని పార్టీలు సహకరిస్తాయని చెప్పారు.
ప్రస్తుతం 26జిల్లాల బాధ్యతను అధ్యక్షుడు నాకు ఇచ్చారు….ఆ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నాను…రాజ్యసభ సభ్యుడిగా విశాఖ పట్నంను నోడల్ జిల్లాగా ఎంచుకున్నానని వెల్లడించారు. కాలువలు, చెరువులు, నదులు ఆక్రమించే హక్కు ఎవరికీ లేదు.. అయ్యన్నపాత్రుడు చెరువు కాలువను ఆక్రమించారని ఫైర్ అయ్యారు.
హై కోర్టులో అయ్యన్నకు తాత్కాలికంగా స్టే ఇవ్వొచ్చు..అయ్యన్న ఆక్రమణ విషయం అధికారులు చూసుకుంటారు..విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని హామీ ఇచ్చారు సాయిరెడ్డి. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా పరిపాలన రాజధాని ఆగదు..సింహాచలం చుట్టూ ఎంపీ ల్యాండ్స్ తో రక్షణ గోడ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.