చివరకు ఎంతకు దిగజారిపోయారు బాబు గారూ! – విజయసాయి రెడ్డి

-

చివరకు ఎంతకు దిగజారిపోయారు బాబు గారూ! అంటూ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఇంటర్మీడియట్‌లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. నేను చెప్పంగ చెప్పంగ విని మీరు టెక్నాలజీలో నంబర్ 1 అయిపోయారని చంద్రబాబు తెలిపారు. ఈ వ్యాఖ్యలను విజన్ 2046 కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు విజయసాయి కౌంటర్ ఇచ్చారు.

విజన్ 2020 అని దేశమంతా తిరిగి స్వీయ ప్రగల్భాలు పలికినా 2004లో ప్రజలు చిత్తుగా ఓడించారు. ఇప్పుడు విజన్ 2047 అంటూ మరో గారడీ చేయాలని చూస్తున్నాడు బాబు గారు. ఓటి పడవకు పైన ఎన్ని అలంకారాలు చేసినా నీటిలోకి వెళ్లిన తర్వాత మునగక తప్పదని చురకలు అంటించారు సాయిరెడ్డి. చివరకు ఎంతకు దిగజారిపోయారు బాబు గారూ! రాజకీయంగా ఎదుర్కోలేక ఆ వ్యక్తే లేకపోతే బాగుండు అనే దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు. భూమి పేలిపోయి అందులోకి ఆయన కూరుకుపోవాలా? పురాణగాథల్లోలా శపిస్తే నిజమైపోవడానికి మీరేమైనా మునీశ్వరులా? దేవతలా? అంటూ సెటైర్లు పేల్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news