కుప్పం పై రెడ్డి గారి ‘ విధ్వంసం ‘ ! ఇదేం ర్యాగింగు సామీ ?

-

వైసీపీ లో జగన్ తర్వాత ఆ స్థాయిలో రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో రాజ్యసభ సభ్యు డు విజయసాయిరెడ్డి బాగా ఆరితేరి పోయారు.ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకు పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను విజయసాయిరెడ్డి పర్యవేక్షించడం తో పాటు , రాజకీయ ప్రత్యర్ధులకు గట్టి కౌంటర్ ఇస్తూ , ఎప్పటికప్పుడు వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు . అలాగే వైసీపీ పై విమర్శలు ఎవరు చేసినా, విజయసాయిరెడ్డి ఏమాత్రం ఉపేక్షించకుండా, వారికి గట్టి షాక్ ఇస్తూనే, వారి పరువును సోషల్ మీడియా వేదికగా తీసేస్తూ ఉంటారు. ఇక టిడిపి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ,  ఆయన కుమారుడు లోకేష్ వ్యవహారాలపై ఎప్పుడూ ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా, తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ, వారి పరువు మొత్తం తీసేస్తుంటారు.
తాజాగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని సమస్యలపై వ్యంగ్యంగా చంద్రబాబును ఉద్దేశించి విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.  ” ఆక్రమణలను కూల్చేస్తే …. విధ్వంసం. వందల కోట్ల స్కాములకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తే బలహీన వర్గాల పై కక్ష సాధింపు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కేసులు నమోదు చేస్తే…. వేధింపులు. ఏం చేయకుండా వదిలేస్తే…. నిప్పును కాబట్టి కేసు కూడా పెట్టలేక పోయానని ఎగతాళికి దిగుతాడు బాబు. ” అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇక మరో ట్వీట్ లో ఇదే రకంగా విమర్శలు చేశారు. ” మీరు పుట్టిన 1950లో మీ ఊరు ఒటే కాదు. దేశంలోని 90% గ్రామాలకు కరెంటు లేదు. పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు గదా, వెన్నెలలో గుక్కెడు తాగునీరు అందించలేకపోయారే. దాన్నేమనాలి? వ్యవసాయం దండగ అని తేల్చారు కాబట్టి సాగునీరు ఇచ్చే ఉద్దేశం లేదనుకుంటాం.” అంటూ విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version