తిరుమల భక్తులకు అలర్ట్.. మూడు నెలలు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

-

తిరుమల వెంకన్న స్వామి భక్తులకు గుడ్ న్యూస్. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ వీఐపీ దర్శనాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలలు.. ఏప్రిల్, మే, జూన్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరుమలకు భక్తుల  తాకిడి రోజురోజుకి ఎక్కువవుతోంది. ఇంటర్, టెన్త్ పరీక్షలు పూర్తి కావడం, స్కూళ్లు, కళాశాలలకు సెలవులు రావడంతో స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీటీడీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. వేసవిలో భక్తుల రద్దీ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీటీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వీఐపీ దర్శనాల తొలగింపుతో సామాన్య భక్తులు దర్శనానికి గంటలు గంటలు వేచి చూడాల్సిన అవసరం ఉండదని ఆయన తెలిపారు. బయట ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. భక్తులకు టీటీడీ మంచినీరు, మజ్జిగ, అన్న ప్రసాదం ఎక్కువగా అందిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మాడవీధుల్లో భక్తులు చెప్పులు లేకుండా నడవడానికి ఇబ్బంది పడకుండా కూల్ పెయింటింగ్ తో పాటు తాగునీటి సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news