బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. రానున్న వారం రోజుల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడనం తీరం దాటే సమయంలో కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ముంపుప్రాంతాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాకు పెను ప్రమాదం పొంచి ఉన్నట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ముందస్తు చర్యలు సైతం చేపడుతున్నారు. ఈ తరుణంలోనే… విశాఖలో టాల్ ఫ్రీ నంబర్లు ఏర్పాలు చేశారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 08912590102, 089125901800, 0912565454 నంబర్లకు ఏ సహాయం కావాలన్నా ఫోన్ చేయవచ్చని సూచించారు.