వైజాగ్ దిగంబర దొంగ అరెస్ట్

విశాఖలో దిగంబరంగా దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డిసిపి ఐశ్వర్య రస్తోగి మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి దిగంబరంగా ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి, అతడికి సహయం చేస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశామని అన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడ్ని పట్టుకున్నామని అన్నారు.

గుంటూరుకు చెందిన కంచర్ల మోహన్ రావు అలానే అనకాపల్లికి చెందిన సంతోష్ లుగా గుర్తించామని అన్నారు. నిందితుల మీద గతంలో 60కి పైన కేసులున్నాయని వాటి రీత్యా పలు జైళ్లలో శిక్ష కూడా అనుభవించారని పేర్కొన్నారు. ఇద్దరి వద్ద నుంచి 6 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అల బట్టలు లేకుండా దొంగతనం చేయడం ద్వారా మతిస్థిమితం లేని వ్యక్తి గా వదిలేస్తారని ఆలోచనతోనే ఇలా చేసినట్లు అంగీకరించాడు నిందితుడు.