వాషింగ్‌మెషిన్‌లో రూ.1.30కోట్లు.. విజయవాడకు తరలిస్తుండగా పట్టివేత

-

ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దసరా పండుగకు వెళ్లి సొంతూళ్ల నుంచి జనం తిరిగి వస్తున్న వేళ టోల్‌గేట్లు, చెక్‌పోస్టుల వద్ద పోలీసులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు.  నగదు, మద్యం, బంగారం, ఇతర వస్తువుల తరలింపుపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు పెద్దఎత్తున వాహనాల్లో తిరుగుపయనం కాగా… తనిఖీలు కేంద్రాల వద్ద ఆపుతున్నారు. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలతో నగరానికి వస్తున్న వారు ఇబ్బందులకు గురవుతున్నారు.

మరోవైపు ఏపీలోని విశాఖ నగరంలోని ఎన్‌ఏడీ జంక్షన్‌ వద్ద భారీగా హవాలా నగదును పోలీసులు పట్టుకున్నారు. వాషింగ్‌ మెషిన్‌లో కరెన్సీ నోట్ల కట్టలను ఉంచి ఆటోలో తరలిస్తుండగా విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు తరలిస్తుండగా నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ నగదు విలువ దాదాపు రూ.1.30కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. నగదుతో పాటు 30 మొబైల్‌ సీజ్ చేసినట్లు తెలిపారు. నగదు తరలింపుపై సరైన ఆధారాలు చూపించక పోవడంతో సీఆర్‌పీసీ 41, 102 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news