విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ట్రైన్ అమలు చేసే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు నగరాల్లో 25 కి.మీ మేర డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖలో మొదటి స్టేజ్ లో మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కి.మీ, నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి.
గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కి.మీ డబుల్ డెక్కర్ మోడల్ లో మెట్రో ఉంటుంది. విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కి.మీ మేర డబుల్ డెక్కర్ ఏర్పాటు చేయనున్నారట. 2017 మెట్రో పాలసీ అధారంగా ఫండింగ్ మోడల్స్ పై చర్చ ఉంటుందని చెబుతున్నారు. డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ట్రైన్ అమలు చేస్తే… ఏపీ సరికొత్త చరిత్రే సృష్టిస్తుంది.