విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 54 మంది గాయపడినట్లు ఆ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. వారికి స్థానిక ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా మృతి చెందిన వారి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆరు మృతదేహాలు విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో.. మరో మృతదేహం మిమ్స్ ఆస్పత్రి మార్చురీలో ఉంచినట్లు.. మిగతా 7 మృతదేహాలను విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు గుర్తించిన మృతుల వివరాలు
- 1. గిరిజాల లక్ష్మి (35)… – ఎస్. పి. రామచంద్రాపురం, జి. సిగడాం మండలం, శ్రీకాకుళం జిల్లా
- 2. కంచు భారతి రవి (30)…. తండ్రి పేరు చిన్నారావు, జోడుకొమ్ము గ్రామం, జామి మండలం, విజయనగరం జిల్లా
- 3. చల్లా సతీశ్ (32)…. తండ్రి పేరు చిరంజీవరావు (లేట్), ప్రదీప్ నగర్, విజయనగరం జిల్లా4. ఎస్.హెచ్.ఎస్.రావు…. రాయగడ పాసింజర్ లోకో పైలట్, ఉత్తర్‌ప్రదేశ్5. కరణం అక్కలనాయుడు (45)…. తండ్రి పేరు చిన్నయ్య, కాపు సంబాం గ్రామం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా6. ఎం. శ్రీనివాస్…. విశాఖ-పలాస పాసింజర్ రైలు గార్డు
- 7. చింతల కృష్ణమనాయుడు (35)…. దెందేరు గ్రామం, కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా
- 8. రెడ్డి సీతమనాయుడు (43)…. రెడ్డిపేట గ్రామం, చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా
- 9. మజ్జ రాము (30)…. గదబవలస గ్రామం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా