అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు అని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఇవాళ ఏపీ డెవలప్ మెంట్ సదస్సులో పాల్గొని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానికి మేం వ్యతిరేకం కాదు ని.. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతోంది. అమరావతిలో మౌళిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు కావాలి. విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మిస్తున్నామన్నారు.
స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. స్వయం సహాయక బృందాల పెండింగ్ రుణాలను మాఫీ చేశాం. బెంగళూరు కంటే వైజాగ్లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. ప్రతిపక్షానికి లబ్ది కలిగించేలా కథనాలు ఇస్తున్నాయి. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే అభివృద్ధి చెందదు. స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్లా మారుస్తామని.. రాడిసన్ బ్లూ హోటల్ లో విజన్ విశాఖ సదస్సు లో మాట్లాడారు. దాదాపు 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు.