ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు అదిరిపోయే శుభవార్త అందించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీలో ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా వాహనమిత్ర కింద రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. ‘సూపర్ 6-సూపర్ హిట్’ విజయోత్సవ సభలో ఈ ప్రకటన చేశారు CM చంద్ర బాబు నాయుడు.

సూపర్ సిక్స్ అంటే హేళన చేశారని…పింఛన్ల పెంపు అంటే అసాధ్యం అన్నారని మండిపడ్డారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారని చురకలు అంటించారు సీఎం చంద్రబాబు. మెగా డీఎస్సీ అవ్వదన్నారు… దీపం వెలగదన్నారు… ఫ్రీ బస్సు కదలదన్నారు…. కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ పథకాలు అమలు చేసి తీరామని.. కోట్ల మంది జనాలు లబ్ది పొందారన్నారు.