ఏపీకి ప్రత్యేక హోదా పై చంద్రబాబు విధానం ఏంటో చెప్పాలి : కాంగ్రెస్ సీనియర్ నేత

-

రాష్ట్రంలో ఇద్దరూ సవుతుల ముద్దుల మొగుడు అనే రాజకీయ సినిమా రసవత్తరంగా సాగుతోంది. . ఏపీ కాంగ్రెస్ మీడియా ఛైర్మన్ డా.ఎన్. తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. ఇద్దరు సవతుల ముద్దుల మొగుడు అనే రాజకీయ సినిమా ఆదివారం ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల ముద్దుల మొగుడు నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత అని అన్నారు. పదేళ్లలో విభజన హామీలు అమలు చేసింటే ఏపీ స్వర్ణాంధ్ర అయ్యేదని చెప్పారు.

ప్రత్యేక హోదాకు బీజేపీ పంగనామాలు పెట్టిందని పార్లమెంట్ లో ఇచ్చిన ప్రధాన హామీలేవీ అమలు కాలేదని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు కేంద్రంలో కీలకంగా ఉన్నారని ఇప్పుడైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని సూచించారు. ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని తేల్చిచెప్పారు. విభజన వరాలను నెరవేర్చుకునే దిశగా చంద్రబాబు అడుగులు వేయాలన్నారు. సకాలంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు అమలుకు చంద్రబాబు చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version