చంద్రబాబు కుర్చీలో బాలకృష్ణ కూర్చోవడం దేనికి సంకేతం : పేర్నినాని

చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లగానే ఆయన సీట్లో బాలకృష్ణ కూర్చోవడం దేనికి సంకేతమని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు స్వల్పకాలిక చర్చ జరిగింది.ఈ చర్చలో ఇవాళ ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ పేర్ని నాని బాలకృష్ణపై సెటైర్లు వేశారు. చంద్రబాబు అసెంబ్లీకి రాకపోతే ఆయన సీట్లో ఎవరూ కూర్చోరన్నారు.

సీఎం జగన్ అసెంబ్లీకి రాకపోతే ఆయన సీట్లో ఎవరూ కూర్చోరని ఆయన చెప్పారు. కానీ చంద్రబాబు జైలుకు వెళ్లగానే అసెంబ్లీలో బాబు సీట్లో బాలకృష్ణ కూర్చోన్నారన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ చంద్రబాబు కుర్చీలో నిలబడి బాలకృష్ణ విజిల్ ఊదడాన్ని పేర్ని నాని ప్రస్తావించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ ద్వారా రెండు లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా బాలకృష్ణ చెబుతున్నారన్నారు. ఎవరో రాసిచ్చిందో చదవడం కంటే వాస్తవాలు తెలుసుకోవాలని పేర్ని నాని బాలకృష్ణకు సూచించారు. ఒప్పందంపై చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారు. ఇప్పుడు ప్రశ్నిస్తే.. కాదు లేదు అని సమాధానాలు చెబుతున్నారని పేర్కొన్నారు.