ఏపీలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు..ప్రజలకు భారీ ఊరట !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారికంగా ప్రారంభించనున్నారు ఏపీ మంత్రి లోకేశ్. తొలి విడతలో భాగంగా విద్యుత్, దేవాదాయ, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ వంటి 161 శాఖల్లో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం కానున్నాయి.

WhatsApp governance services will start in AP from today

తద్వారా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అందుబాటులోకే ప్రభుత్వ సేవలు రానున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మంత్రి నారా లోకేష్‌ ఇచ్చిన సూచనల మేరకే నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం కానున్నాయని చెబుతున్నారు. ఇక నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం అయితే.. తమ సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు జనాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version